సూపర్ స్టార్ మహేష్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ కాగా మరోటి కూడా రెండో హిట్ కొట్టారు. పోకిరి, బిజినెస్ మెన్ ఈ రెండు సినిమాలు పూరీ, మహేష్ కాంబోలో వచ్చాయి. అయితే ఇద్దరు కలిసి హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. మహేష్ తో పూరీ జనగణమన ప్లాన్ చేశాడు కాని ఆ సినిమా గురించి మహేష్ ఎందుకో అంతగా ఇంటెస్ట్ చూపించట్లేదు.

పూరీ మహేష్ తో సినిమాపై ప్లాన్ చేస్తున్నా సరే మహేష్ మాత్రం వేరే ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. మహేష్ తో జనగణమన పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాడు. అయితే మహేష్ పూరీల మధ్య సంది కుదిర్చే ఏర్పాట్లో ఉన్నాడట నిర్మాత అనీల్ సుంకర. మహేష్ కేవలం హిట్ ఇచ్చిన డైరక్టర్స్ కే ఛాన్స్ ఇస్తాడని పూరీ అన్నాడు. అయినా ఆ కామెంట్స్ కు మహేష్ ఏమి ఫీల్ అవ్వలేదు. అయితేం పూరీ బర్త్ డే సందర్భంగా మహేష్ విష్ చేయగా పూరీ సర్ ప్రైజ్ అయ్యాడు.

అయితే ఈ ఇద్దరు కలిసి చేయాల్సిన జనగణమన ప్రాజెక్ట్ పై అనీల్ సుంకర వారిద్దరి మధ్య డిస్కషన్స్ జరిగేలా ఏర్పాటు చేస్తున్నారట. ఈమధ్య మహేష్ సినిమాలను నిర్మిస్తూ వస్తున్న అనీల్ సుంకర పూరీతో మాట్లాడి జనగణమన సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: