ఇంటర్నేషనల్ షో బిగ్ బాస్ బాలీవుడ్ లో కూడా 13 సీజన్లు సక్సెస్ ఫుల్ గా జరుపుకుంది. ప్రస్తుతం 14 సీజన్లో ఈమధ్యనే మొదలైంది. హిందీలోనే కాదు బిగ్ బాస్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళంలో కూడా మొదలైంది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 4 నడుస్తుంది. మొదటి సీజన్ కు ఎన్.టి.ఆర్, రెండవ సీజన్ కు నాని, మూడవ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇక ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 4కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.

ఇక ఈమధ్య బిగ్ బాస్ షో వల్ల ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చ్హుకుంటున్నారు. అందుకే షో హోస్ట్ గా చేసేందుకు స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో నాగార్జున కూడా సక్సెస్ అయ్యారు. అయితే రానున్న బిగ్ బాస్ సీజన్ లో వెంకటేష్, అల్లు అర్జున్, మహేష్ లు కూడా చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సీజన్ 4 ని స్టార్స్ అంతా చూస్తున్నారట. శని ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్స్ వారు చూసి ఫ్యూచర్ లో బిగ్ బాస్ హోస్ట్ గా చేయాలని అనుకుంటున్నారట.

ఆల్రెడీ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా అల్లు అర్జున్, మహేష్ లు కూడా హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉందని టాక్. తప్పకుండా రానున్న సీజన్స్ మరింత క్రేజీగా మారనున్నాయని చెప్పూచ్చు. బిగ్ బాస్ సీజన్ 4 55 రోజులు పూర్తి చేసుకుంది మరో నెలన్నర పాటు ఈ షో నడుస్తుంది. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ పై స్టార్ హీరోల కన్ను పడ్డదని తెలుస్తుంది. మరి రానున్న సీజన్స్ లో ఎవరు హోస్ట్మ్ గా సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: