మెగా ఫ్యామిలీ మూవీస్  అంటే టాలీవుడ్ ఆడియన్స్ పూనకాలు పోతారు. దాదాపుగా డజన్ మంది హీరోలు ఆ కాంపౌండ్ లో ఉన్నారు. వారంతా వంతుల వారీగా మూవీస్ రిలీజ్ చేస్తేనే ఏడాదిలో అరడజన్ మూవీస్ వారివి అవుతాయి. ఇపుడు కరోనా తరువాత అంతా ఒక్కసారిగా టాలీవుడ్ తెర మీద దండెత్తి వస్తే ఇక తెలుగు రాష్ట్రాలో స్క్రీన్స్ ఎన్ని ఉన్నా కూడా  సరిపోతాయా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. 2020 వేస్ట్ అయిందని మెగా ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నరు. దాంతో 2021 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు ఖాళీగా  వదలకూడదని మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అంతా ఫిక్స్ అయిపోయారు.

2021లో వరసగా వచ్చే సినిమాల్లో మెగాస్టార్ ఆచార్య ముందు వరసలో ఉంటుంది. ఆయన ఈ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ అని రాసిపెట్టుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఇక ఈ మూవీ కంటే ముందు వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది. పవన్ రీ ఎంట్రీ మూవీ ఇది. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలే చేసుకుంటోంది. ఇదే వరసలో 2021 చివరి నాటికి అల్లు అర్జున్ పుష్పను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని సుకుమార్ ఆలోచిస్తున్నారుట. అంటే ఆ మూవీ కూడా మరో ఫీస్ట్ అన్నమాట. ఇక మెగా మేనల్లుళ్ళు సాయి రేజ్. వైష్ణవ్ తేజ్ సినిమాలు కూడా 2021లో వరసగా రానున్నాయి. అలాగే వరుణ్ తేజ్ మూవీస్ రెండు అయినా 2021 లో వస్తాయని అంటున్నారు. ఇలా చూసుకుంటే పెద్ద లిస్టే ఉంది. మరి మెగా హీరోలంతా ఒక్కసారిగా వచ్చిపడితే మిగిలిన హీరోలకు అసలు  థియేటర్లు దొరుకుతాయా. లేక చాలా మంది ఓటీటీని చూసుకోవాల్సిందేనా అన్న చర్చ అయితే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: