అవునూ.. మన టాలీవుడ్ లో ఓ ఫేడౌట్ హీరో ప్రొడ్యూసర్ గా మారనున్నాడట. ఇకపై సినిమాల్లో నటించ కూడదని నిర్ణయించుకుని ఇప్పటివరకు వ్యాపారం ద్వారా సంపాదించిన మొత్తాన్ని సినిమాలపై పెట్టుబడులు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరుణ్ ఎన్నో సినిమాల్లో నటించారు. "అంజలి", "ఆదిత్య 369" లాంటి సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. ఆ తరువాత హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో తరుణ్ కి అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. వరుసగా హిట్లు అందుకుంటూ స్టార్ హీరో హోదా ఎంజాయ్ చేశాడు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఆ తరువాత వరుస డిజాస్టర్లు రావడంతో అతడికి అవకాశాలు తగ్గాయి. మెల్ల మెల్లగా ఫేడవుట్ అయిపోయాడు. కానీ హీరోగా నటించాలనే ఆసక్తితో రెండేళ్ల క్రితం "ఇది నా లవ్ స్టోరీ" అంటూ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక హీరోగా సినిమాలు చేయడం మానేయాలని నిర్ణయించుకున్నాడట.
ఇదిలా ఉంటే.. అందుతున్న సమచారం ప్రకారం.. తరుణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన మూడు ప్రాజెక్ట్ లను టేకప్ చేశారని సమాచారం. అయితే నటుడిగా మాత్రం కాదట. నిర్మాతగా మారి సినిమాలు చేయాలని తరుణ్ నిర్ణయించుకున్నారట. ఇప్పటివరకు వ్యాపారం ద్వారా సంపాదించిన మొత్తాన్ని సినిమాలపై పెట్టుబడులు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మూడు ప్రాజెక్ట్ లను ఎన్నుకున్నారట. అందులో రెండు ఓటీటీ రిలీజ్ ల కోసం చేస్తుండగా.. మరొకటి థియేట్రికల్ రిలీజ్ కోసం చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: