త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో తన రెండో సినిమా చేస్తున్నాడు.. rrr తర్వాత రాబోయే ఈ చిత్రం పై ప్రేక్షకులు ఇప్పటినుంచే మంచి అంచనాలు పెట్టుకున్నారు.. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ ప్రతి హీరో ఒక్కసారి కాదు రెండేసి మూడేసి సార్లు సినిమా చేయాలనీ కోరుకుంటారు. అయితే అందరితో సినిమా చేయాలంటే త్రివిక్రమ్ కి మాత్రం ఎలా వీలుపడుతుంది చెప్పండి.. అయితే ఎన్టీఆర్ తర్వాత చేయబోయే త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే రామ్ చరణ్ తో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.. రామ్ చరణ్ కూడా rrr తర్వాత త్రివిక్రమ్ తో చేయాలనీ చూస్తున్నాడట..

ఇకపోతే హీరో రామ్ కూడా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలనీ ఉవ్విళ్లూరుతున్నాడట..  ఇటీవలే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్నాడు రామ్.  ఇద్దరికీ ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యం కాగ ఆ సినిమా హిట్ ఇద్దరికీ మళ్ళీ లైఫ్ ఇచ్చిందని చెప్పాలి.. ముఖ్యంగా శంకర్ పాత్రకు తాను తప్ప మరెవరు సరిపోరు అన్న రేంజ్ లో రామ్ నటించాడు.. ఇక ఈ సినిమా తో నభా నటేష్ లాంటి హీరోయిన్ టాలెంట్ ఇండస్ట్రీ కి దొరికింది.. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రామ్ కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా లో నటిస్తున్నాడు..వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కాగ గత రెండు చిత్రాలు హిట్ అవడంతో ఈ చిత్రం తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చుస్తునారు.. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే తదుపరి సినిమాపై ఎలాంటి అనౌన్స్ రాలేదు..

సినిమా తర్వాత రామ్సినిమా ని ఒప్పుకోలేదు.. దాంతో త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ రామ్ ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‍తో త్రివిక్రమ్‍ చేయాల్సిన సినిమా మరింత ఆలస్యమయ్యేట్టు అయితే రామ్‍తో సినిమా ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ అవకాశాన్ని ఎలాగయినా కైవసం చేసుకోవాలని రామ్‍ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. త్రివిక్రమ్‍తో ఫ్యామిలీ సినిమా కాకుండా ‘జులాయి’ లాంటి యాక్షన్‍ బేస్డ్ ఫ్యామిలీ సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే తన కోరికను త్రివిక్రమ్‍కు రామ్‍ వెలిబుచ్చాడట. స్రవంతి రవికిషోర్‍తో వున్న అనుబంధం వల్ల త్రివిక్రమ్‍కు రామ్‍తో సినిమా చేసే ఆబ్లిగేషన్‍ అయితే ఎప్పట్నుంచో వుంది. అయితే వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేయడం వల్ల అది ఇంతవరకు కుదర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: