అవునూ.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ. అయితే ఇంతకీ ఏ విషయంలో రజినిని అంత మాట అన్నది? ఎందుకు అన్నది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. తాజాగా సీనియర్ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. "ప్రియమైన రజినీకాంత్ గారు.. మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. అంతకుమించి ఏది లేదు. వజ్రం లాంటింది మీ మనసు. నిండు నూరేళ్లు మీరు జీవించాలి. అందుకు మీరు ఏం చేయాలంటే అది చేయండి. మీపై మాకు ప్రేమ తగ్గదు. మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాం" అని ఖుష్బూ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఖుష్బూ రజినీకాంత్ సరసన "అన్నాత్తే" అనే సినిమాలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం విషయం మరోసారి తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆరోగ్య కారణాల వల్ల రజినీకాంత్ రాజకీయాలకు దూరం కావాలని వైద్యులు సూచించినట్టు సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ కావడం మరింత సంచలనంగా మారింది. ఆయన తన లేఖలో కరోనా కారణంగా రజనీకాంత్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండటంతో  ఆయన రాజకీయ ప్రవేశానికి విఘాతం కలుగుతుందని రాసుకొచ్చారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ అయిన రజినీకాంత్  బయట విస్తృతంగా తిరిగితే ఆయన ఆరోగ్యానికి ముప్పు కలిగే పరిస్థితి ఉందని, ఇప్పట్లో ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదు అంటూ  ఆ లేఖలో ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించారు రజిని. ఈ లేఖకు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: