టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎట్టకేలకి పెళ్లి చేసుకుని ఒక ఇంటామె అయిపోయింది. తన చిన్ననాటి స్నేహితుడు ముంబైలో వ్యాపారవేత్త అయిన గౌతం కిచ్లు అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి నిన్న కాక మొన్న అంగరంగ వైభవంగా అత్యంత సన్నిహితుల నడుమ జరిగిపోయింది. ఆమె పెళ్ళి జరిగిన నాటి నుంచే ఆమె పెళ్లి ఫోటోలు, కొన్ని పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాజల్ పెళ్లి నేపధ్యంలో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ అంతా ఆమె పెళ్లి ఫోటోలని వీడియోలని వైరల్ చేసే పనిలో ఉన్నారు.

 తాజాగా ఆమె వివాహానికి సంబంధించి ఒక పిక్ పోస్ట్ చేసిన అనుష్క శెట్టి "ఈ భూ ప్రపంచం మీద ఏదైనా అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే అది పెళ్లి ద్వారా వచ్చే సంతోషమేనని పేర్కొంది" ఒకే ఆలోచనతో ఉన్న రెండు మనసులు అలానే ఒకే గుండె చప్పుడు కలిగిన రెండు గుండెలు అంటూ తనదైన శైలిలో కవిత్వం ఏదో రాసుకొచ్చింది. అలానే డియర్ కాజల్ నీకు గౌతమ్ కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ అనుష్క రాసుకొచ్చింది.

 అలానే #KajGautKitched అంటూ ఒక ట్యాగ్  కూడా పెట్టిందనుకోండి. ఇక అనుష్క విషెస్ చెప్పడంతో అనుష్క ఫ్యాన్స్ అందరూ ఆ స్క్రీన్ షాట్ లు తీసి వాటిని వైరల్ చేసే పనిలో పడ్డారు. మరికొందరు ఫాన్స్ ఏమో ఆమె పని అయిపోయింది మరి మీ సంగతి ఏంటి అంటూ అనుష్క పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ప్రభాస్ తో పెళ్లి పీటల మీద ఉన్న పిక్ పెట్టి, ఇది త్వరగా నిజమవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఆమె శుభ వార్త ఎప్పుడు చెబుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: