స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ తోనే ఆయన తీసిన ప్రతిష్టాత్మక సినిమా సింహాద్రి. నమ్మినబంటు సింహాద్రి గా ఆ సినిమాలో ఎన్టీఆర్ అద్భుత నటన అలానే దర్శకుడు రాజమౌళి అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ వెరసి రిలీజ్ తర్వాత సింహాద్రి సినిమాని భారీ కమర్షియల్ హిట్ గా నిలిపాయి. ఇక అక్కడ నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన రాజమౌళి ఇప్పటి వరకు కూడా తాను చేసిన ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక్కో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అపజయమెరుగని దర్శకుడిగా ముందుకు కొనసాగుతున్నారు.

ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో పాటు వందల కోట్ల రూపాయల కలెక్షన్ ని ఆర్జించడం జరిగింది. అంతేకాక ఈ సినిమాలు నెలకొల్పిన రికార్డులు తో దేశవిదేశాల్లోని పలు సినిమా ఇండస్ట్రీలు సైతం టాలీవుడ్ వైపు చూడసాగాయి. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా రౌద్రం రణం రుధిరం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ కెరీర్లో తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్, బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లాక్ డౌన్ కు ముందు 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనుందట సినిమా యూనిట్.  

ఇకపోతే ఈ సినిమా యొక్క రిలీజ్ కు సంబంధించి ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ ఆర్ఆర్ఆర్  సినిమాని వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని చూస్తోందట మూవీ యూనిట్. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఈ కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావాలంటే వచ్చే ఏడాది వేసవి వరకూ సమయం పడుతుందని అయితే ఆ సమయానికి చాలా వరకు సినిమాలు రిలీజ్ ని ఫిక్స్ చేసుకుని ఉండటంతో తమ సినిమా అప్పుడు రిలీజ్ చేయడానికి రాజమౌళి ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇక ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో రిలీజ్ చేస్తే ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాకపోవచ్చని అందువల్ల దాని అనంతరం వచ్చే దసరా లేదా దీపావళి పండుగల సమయానికి ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమాని థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. వాస్తవానికి ఈ ఏడాది జులై లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడటం అయితే మధ్యలో కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ చాలా రోజులు ఆగిపోవడంతో మరి కొన్నాళ్లపాటు దీని రిలీజ్ ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ విధంగా పలు రకాల కారణాలతో ఈ సినిమాని వచ్చే ఏడాది చివర్లో ని చూసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే మాత్రం ఒక రకంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకులకు ఇది కొంత నిరాశ కలిగించే వార్త అని చెప్పక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: