టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమా 1999 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఆ విధంగా తొలి సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి పేరుని దక్కించుకుని మహేష్ బాబు ఆ సినిమా ద్వారా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ పలు విజయాలతో దూసుకెళ్లిన మహేష్ బాబు తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారనే చెప్పాలి.
మధ్యలో కొన్ని అతి పెద్ద బ్లాక్ బస్టర్లు అలానే ఇండస్ట్రీ హిట్స్ అందుకొని సూపర్ స్టార్ గా తిరుగులేని పేరు ప్రఖ్యాతలను కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు అందుకున్న మహేష్ బాబు మధ్యలో అక్కడక్కడా కొన్ని ఫ్లాప్స్ ను కూడా చవిచూడటం జరిగినది. ఇక మొదటి నుండి కూడా మహేష్ బాబుకు లేడీస్ లో ఫాలోయింగ్ విపరీతంగా ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ నటుడు నాగార్జున తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న హీరోల్లో మహేష్ బాబు కి అత్యధిక స్థాయి మహిళలు ఆదరణ ఉంది. ఇకపోతే మహేష్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు నిజంగా అది మా అదృష్టమే అంటూ ఇటీవల ఎందరో హీరోయిన్లు బహిరంగంగానే మాట్లాడుతూ చెప్పడం జరిగింది. టాలీవుడ్ సహా బాలీవుడ్ హీరోయిన్లు కొందరు కూడా మహేష్ తో ఒక సినిమా ఛాన్స్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాం అంటూ చెప్పిన వారు కూడా లేకపోలేదు.  
ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో శృంగార భామగా అక్కడక్కడ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అలాగే ప్రత్యేక గీతాల్లో నటిస్తూ ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి హంసానందిని. ఇక ఇటీవల ఒకానొక మీడియో ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా హంసానందిని మాట్లాడుతూ ప్రస్తుతం తన కెరీర్ బాగానే సాగుతుందని అయితే తనకు ఒక చిన్న లోటు మాత్రం ఉందని ఆమె అన్నారు. ఇప్పటివరకు తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోలతో పని చేశానని కానీ ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మాత్రమే నటించే అవకాశం రాలేదని ఆ అవకాశం కోసం నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను అలానే నేను ఆయనకు పెద్ద అభిమానిని అవకాశం వచ్చి స్క్రీన్ పై ఆయన పక్కన కొన్ని క్షణాలు కనిపించినా చాలు నా జన్మ ధన్యమే అంటూ ఆమె ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పడం జరిగింది. మరి పాపం ఆమె ఆశిస్తున్నట్లు గా సూపర్ స్టార్ సినిమాలో ఎప్పుడు నటించే ఛాన్స్ వస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: