టాలీవుడ్ హీరోల్లో ప్రస్తుతం మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న యువ నటుల్లో విజయ్ దేవరకొండ, నాని ఇద్దరూ కూడా ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మొదటగా టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన నాని, పలు సినిమాలకు పని చేసిన అనంతరం ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన అష్టా చమ్మా సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా నటించడం, ఆ సినిమా ద్వారా మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది. ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని తన టాలెంట్ తో పలు సక్సెస్ లతో దూసుకెళ్లిన నాని, ప్రస్తుతం మంచి సినిమాలతో కొనసాగుతున్నారు.

ఇటీవల అ సినిమా ద్వారా నిర్మాతగా కూడా మారిన నాని, కష్టాన్ని నమ్మి ధైర్యంగా ముందడుగు వేస్తే కొంత ఆలస్యం అయినా మనల్ని విజయం తప్పనిసరిగా పలకరిస్తుందని అంటూ ఉంటారు. ఇక మొదట అక్కడక్కడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కొనసాగిన యువ నటుడు విజయ్ దేవరకొండ, ఆపై కొన్నాళ్ళకు తన స్నేహితుడు తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారి తొలి సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల భారీ సక్సెస్ లతో యువతలో విశేషమైన ఆదరణ ని చూరగొన్న విజయ్ ప్రస్తుతం వరుసగా అవకాశాలతో కొనసాగుతున్నాడు. తన తల్లితండ్రులు, ఫ్రెండ్స్ మొదటి నుండి తనకు అండగా ఉండడం, అలానే తనలోని కసి, పట్టుదల నటుడిగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని అంటుంటారు విజయ్. అయితే ఈ ఇద్దరు హీరోల కెరీర్ విషయం పరిశీలిస్తే వీరిద్దరూ కూడా ముందు, వెనుక టాలీవుడ్ కి చెందిన ఎటువంటి ట్యాగ్ లేకుండా, అదేనండి ఎటువంటి పలుకుబడి, మద్దతు లేకుండా స్వయంకృషితో క్రేజీ హీరోలుగా పేరు దక్కించుకుని కొనసాగుతున్న వారు కావడం విశేషం.

నిజానికి చిత్ర పరిశ్రమలో వంశపారంపర్యం, వారసత్వం అనేది ఉన్నప్పటికీ కూడా, మనలో కనుక మంచి టాలెంట్ ఉంటె ఎవరి మద్దతు లేకపోయినప్పటికీ కూడా తప్పకుండా కొంత ఆలస్యం అయినా మంచి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని, కాగా అందుకు ఉదాహరణ కేవలం విజయ్, నాని మాత్రమే కాకుండా మరికొందరు నటులు కూడా ఉన్నారని, అయితే మనం చేసేపని పై శ్రద్ధ పెట్టడంతో పాటు మంచి అవకాశాల కోసం ఎదురు చూడడం, ముఖ్యంగా మన మీద మనకు నమ్మకం కలిగి ఉంటె చిత్రసీమలో తప్పకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అంటున్నారు పలువురు సినిమా ప్రముఖులు, విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: