ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ లో కొన్నిసార్లు ఊహించని కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి సెట్ కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు అక్కినేని నాగచైతన్యని కలిసి ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. గతంలో ‘జైహింద్’ సినిమాతో పాటు తాను హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు అర్జున్. చాలా వరకు పోలీస్, దేశభక్తి నేపథ్యంలోనే సినిమాలు తీశాడు.

ఇప్పుడు హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ కథను సిద్ధం చేసుకున్నాడట అర్జున్. ఈ కథను చైతుకి వినిపించినట్లు తెలుస్తోంది. చైతూకి కూడా యాక్షన్ సినిమాలంటే ఆసక్తి. కెరీర్ ఆరంభం నుండి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో అర్జున్ చెప్పిన యాక్షన్ కథ చైతుకి నచ్చిందని సమాచారం.


కానీ ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ కారణంగా.. అర్జున్ తో సినిమా ఎప్పుడు కుదురుతుందో చెప్పలేని పరిస్థితి. మరోపక్క అర్జున్ ఇదే కథను హీరో సుధీర్ బాబుకి కూడా చెప్పినట్లు సమాచారం. ఈ ఇద్దరి హీరోల్లో ఎవరో ఒకరితో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఈ సినిమా ఓకే అయితే  తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా పెట్టి సొంతంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి అర్జున్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి! ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్  కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....






మరింత సమాచారం తెలుసుకోండి: