త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పంచ్‌లతో అందరినీ మాయ చేస్తుంటాడు. అందుకే టాలీవుడ్‌ స్టార్లు గురూజీ అని పిలుస్తుంటారు. ఇలాంటి గురూజీనే మాయలో పడేసిందట ఒక హీరోయిన్. టాలీవుడ్‌కి ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో, అలా త్రివిక్రమ్‌ని ఇంప్రెస్‌ చేసిందట. ఇంతకీ పంచ్‌మాస్టర్‌ని ఫిదా చేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు కేతిక శర్మ.

త్రివిక్రమ్ శ్రినివాస్‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తే స్టార్‌ మారుతుందని చాలామంది హీరోయిన్లు నమ్ముతుంటారు. అందుకే చాలామంది హీరోయిన్లు ఈ డైరెక్టర్‌తో వర్క్‌ చెయ్యాలని ఆశ పడుతుంటారు. ఇలాంటి స్టార్‌ మేకర్‌, ఒక యంగ్‌ హీరోయిన్‌కి పడిపోయాడట. తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కానీ, కేతిక శర్మకి భారీ ఆఫర్‌ ఇస్తున్నాడట త్రివిక్రమ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ రీసెంట్‌గా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ కోసం అల్లు అర్జున్‌తో ఒక కమర్షియల్‌ యాడ్‌ షూట్‌ చేశాడు. ఈ యాడ్‌లో బన్ని గర్ల్‌ ఫ్రెండ్‌గా చేసింది కేతిక శర్మ. ఇక ఈ చిన్న ప్రమోషనల్‌ వీడియోలో కేతిక మాగ్జిమమ్‌ పెర్ఫామెన్స్‌ చూపించే సరికి, పంచ్‌ మాస్టర్‌ పడిపోయాడట. ఈ అమ్మాయికి పుషప్‌ ఇవ్వాలని, నెక్ట్స్‌ జూ.ఎన్టీఆర్‌తో తియ్యబోయే సినిమాకి కేతికని హీరోయిన్‌గా సెలక్ట్‌ చేస్తున్నాడట త్రివిక్రమ్.

త్రివిక్రమ్-జూ.ఎన్టీఆర్‌ మూవీకి పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకుంటారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ఇప్పుడేమో కేతిక శర్మని సెలక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో కేతిక హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయితే మాత్రం ఈమె కెరీర్‌ మరో రేంజ్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత తారక్‌ పాన్‌ ఇండియన్‌ మూవీస్ ప్లాన్‌ చేస్తున్నాడు. సో ఈ పాన్‌ ఇండియన్‌ ప్లాన్స్‌తో కేతికకి  నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు వచ్చే అవకాశముంది. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కేతిక శర్మ మాయచేసింది. రొమాంటిక్ తో ఎంట్రీ  ఇస్తోంది ఈ బ్యూటీ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇప్పటికే ఓ యాడ్ కూడా చేసి అలరించింది.





మరింత సమాచారం తెలుసుకోండి: