తమ్ముడిని డైరెక్ట్‌ చెయ్యడం ఓకే గానీ అన్నయ్యతో సినిమా అంటే కష్టం అంటున్నాడట హరీశ్ శంకర్. పవన్‌ కళ్యాణ్‌ని డైరెక్ట్‌ చెయ్యడం వరకు నో ప్రాబ్లమ్‌, చిరంజీవితో సినిమా అంటే కొంచెం సమయం  కావాలంటున్నాడట. మరి ఈ డైరెక్టర్‌కి తమ్ముడితో లేని ఇష్యూ అన్నయ్యతో ఏం వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

'లూసిఫర్' రీమక్ నుంచి వి.వి.వినాయక్‌ని తప్పించారని, హరీశ్ శంకర్‌కి ఈ రీమేక్‌ బాధ్యతలు అప్పగించారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ రీమేక్‌ స్టార్ట్ అవుతుందనే టాక్ కూడా వచ్చింది. అయితే లేటెస్ట్‌గా హరీశ్ శంకర్‌ ఈ రీమేక్‌కి నో చెప్పాడనే మాటలు వినిపిస్తున్నాయి.

హరీశ్‌ శంకర్‌ ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ స్టార్ట్ చెయ్యాలని షెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నాడు. 'వకీల్‌సాబ్' నుంచి పవన్‌ ఫ్రీ అవ్వగానే క్లాప్ కొట్టెయ్యాలని ప్రిపరేషన్స్ కూడా మొదలుపెట్టాడట. ఈ సమయంలో 'లూసిఫర్' రీమేక్‌ అంటే కష్టమని, ఈ సారికి వదిలేయమని ఈ ప్రాజెక్ట్‌ సహ నిర్మాత ఎన్.వి.ప్రసాద్‌కి చెప్పేశాడట హరీశ్ శంకర్.

'లూసిఫర్' రీమేక్‌కి మొదట సుజిత్‌ని డైరెక్టర్‌గా తీసుకున్నాడు చిరంజీవి. అయితే కొన్ని కారణాలతో సుజిత్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకెళ్లాడు. తర్వాత వినాయక్ పేరు వినిపించింది. వినాయక్ కూడా స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి మధ్యలో ఏమైందో ఏమో వినాయక్‌ని తప్పించి హరీశ్‌ని తీసుకుంటారనే ప్రచారం జరిగింది. మరి ఫైనల్‌గా 'లూసిఫర్' రీమేక్‌ని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

మొత్తానికి లూసిఫర్ రీమేక్ కు హరీశ్ శంకర్ నో చెప్పేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో హరీశ్ శంకర్ బిజీబిజీ అయిపోయాడు. ఇప్పుడు లూసీఫర్ రీమేక్ స్క్రిప్ట్ రెడీ చేయడం కష్టమనే భావనలో హరీశ్ శంకర్ ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం.. ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.







మరింత సమాచారం తెలుసుకోండి: