అక్కినేని హీరోలతో రెండు సినిమాలు చేసిన నిధి అగర్వాల్ రెండు సినిమాలు నిరాశపరచగా పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అమ్మడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాలకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది నిధి అగర్వాల్ ఆమెకు స్టార్స్ నుండి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ తన నెక్స్ట్ సినిమాలు త్వరలో ప్రకటించనుంది.

ఇక లేటెస్ట్ గా నిధి అగర్వాల్ పవర్ స్టార్ సినిమా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా రాబోతున్న సినిమాలో నటిస్తుందని టాక్. క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ సినిమా కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడు. పవన్ కోసం కొత్త కథతో వస్తున్నాడు క్రిష్. తన కెరియర్ లో ఇప్పటివరకు పవన్ చేయలని వెరైటీ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

ఇలాంటి సినిమాలో నిధి అగర్వాల్ కు ఛాన్స్ రావడం లక్కీ అని చెప్పొచ్చు. పవన్ తో ఛాన్స్ అంటే టాలీవుడ్ లో అమ్మడు బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టే. పవన్ సినిమా హిట్టైతే నిధి అగర్వాల్ కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారడం పక్కా. మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నిధి అగర్వాల్ ఛాన్స్ అందుకుందని టాక్.                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: