పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తుండగా అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్  లాయర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తుండగా పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇప్పటికే లాక్ డౌన్ కి ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన పింక్ మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే  పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు మగువ మగువ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి పవన్ ఫ్యాన్స్ ని అలానే  ప్రేక్షకుల్ని ఎంతో అలరించడం జరిగింది.

ఇకపోతే ఈ సినిమా నుండి రెండవ సాంగ్ డిసెంబర్ మొదటి వారంలో యూట్యూబ్ లో రిలీజ్ చేయనుందట మూవీ యూనిట్. ఇటీవల రిలీజ్ అయిన మగువా మగువా సాంగ్ మాదిరిగానే ఈ పాట కూడా ఆడవారి యొక్క గొప్పతనాన్ని గురించి తెలిపే విధంగా మరొక స్టైల్లో సాగుతుందని కాగా ఈ సాంగ్ కి కూడా అదిరిపోయే రేంజ్ లో తమన్ ట్యూన్ అందించాడని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఇదే గనుక నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: