గతేడాది మొత్తంగా మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ముందుగా గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు అలానే తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. ఇక అదే ఏడాది డిసెంబర్లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేశారు బాలకృష్ణ. అయితే ఆ మూవీ కూడా ప్రేక్షకులను, అభిమానులను నిరాశ పరిచింది.

అనంతరం కొంత ఆలోచన చేసిన బాలకృష్ణ తన తదుపరి సినిమా అవకాశాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుకి అప్పగించారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభం కాగా ఇందులో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఎంపికైంది. యువ సంగీత తరంగం తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు విపరీతమైన స్పందన లభించడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలకు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా టైటిల్ మోనార్క్ అని ఫిక్స్ చేశారు అంటూ కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. అయితే ఈ విషయమై లేటెస్ట్ గా కొన్ని ఫిలిమ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ టైటిల్ ని 'టార్చ్ బేరర్' గా ఫైనల్ చేసినట్లు సమాచారం. అంటే దీని అర్ధం మార్గదర్శి అని, సినిమాలో హీరో పాత్ర ఆ విధంగానే సాగుతుందని టాక్. ఇప్పటికే పలు టైటిల్స్ పరిశీలించిన మూవీ యూనిట్ ఫైనల్ గా దీనికి మొగ్గుచూపిందని అతి త్వరలో టైటిల్ విషయమే అధికారికంగా ప్రకటన కూడా బయటకు రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: