బిగ్ బాస్ సీజన్ 4 కింగ్ నాగార్జున హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. 16 మంది డైరెక్ట్ గా కంటేస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి 19మందిలో ప్రస్తుతం హౌజ్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే మాత్రం ఏడుగురు మాత్రమే హౌజ్ లో ఉంటారు. అయితే సీజన్ ఎండింగ్ కు వస్తున్న టైం లో బిగ్ బాస్ షో మీద ఆస్కతి చూపిస్తున్నారు ఆడియెన్స్.

లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 11వ వారం అత్యధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. నాగార్జున చెప్పిన దాని ప్రకారం ఈ వారం 9.5 కోట్లు ఓట్లు ఆడియెన్స్ వేసినట్టు తెలుస్తుంది. అయితే నాగ్ చెప్పినన్ని ఓట్లు నిజంగా వచ్చాయా అని ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. అయితే హౌజ్ మేట్స్ మాత్రం అన్ని ఓట్లు పడ్డాయంటే తమకు బయట ప్రజల అభిమానం దొరికినట్టే అని ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వారం 9.5 కోట్ల ఓట్లు అంటే ఇది నిజంగా రికార్డ్ ఓట్స్ అని చెప్పాలి.

బిగ్ బాస్ తెలుగు నాలుగు సీజన్స్ లో ఎప్పుడు ఇన్ని ఓట్లు రాలేదు. నాగ్ ఎనౌన్స్ మెంట్ చేయగానే హౌజ్ మేట్స్ తో పాటుగా ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 సూపర్ హిట్ అయినట్టే. ఐపిఎల్ సీజన్ కూడా అవడంతో బిగ్ బాస్ సీజన్ 4 పై మరింత క్రేజ్ పెరిగింది.                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: