బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. నాగార్జున ఎప్పటిలానే తన జోష్ కనబరచారు. ఇక హౌజ్ మేట్స్ కు మరోసారి ఫ్యామిలీ మెంబర్స్ ను చూపించి సర్ ప్రైజ్ ఇచ్చారు నాగ్. అయితే కంటెస్టంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ను రప్పించడంతో పాటుగా వారికి కూడా ఓ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఉన్న ఎనిమిది మంది కంటెస్టంట్స్ లో ఎవరు టాప్ 5 అని బోర్డ్ మీద వారి ఫోటోలు పెట్టాలని చెప్పారు నాగార్జున.

అయితే అందరు ఎవరికి తోచినట్టుగా వారు టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉన్న కంటెస్టంట్స్ ను గెస్ చేసి పెట్టారు. అయితే ఎక్కువశాతం చెప్పిన దాని ప్రకారం అభిజిత్, అఖిల్, సోహెల్, హారిక, అరియానా టాప్ 5లో ఉన్నారు. మోనాల్, లాస్య, అవినాష్ లు టాప్ 5లో ఉండే ఛాన్సులు తక్కువ అని వారు చెప్పారు. దాదాపు బిగ్ బాస్ కంటెస్టంట్స్ యొక్క రియల్ ఇంటి సభ్యులు ఇచ్చిన టాప్ 5 రేటింగ్ కరెక్ట్ అని చెప్పొచ్చు. అయితే వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది మాత్రం మరో నెల రోజులు వెయిట్ చేస్తే గాని తెలుస్తుంది.

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4లో ఈ సీజన్ అయినా అమ్మాయి విజేతగా నిలుస్తుందని అనుకుంటే అది కూడా జరిగేట్టు కనిపించడం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్, సోహెల్, అఖిల్ ల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరు విజేతగా నిలుస్తారని అంటున్నారు.                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: