కొరియోగ్రఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నటుడిగా, దర్శకుడిగా ప్రభుదేవా సినిమాల కంటే కూడా పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా హెడ్ లైన్స్‌లో ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈయన కెరీర్ అంతా సాఫీగానే ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం వివాదాలమయంగానే ఉంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఈయన కాంట్రవర్సీలతోనే ఉంటాడు. ఇక ఇటీవల ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది.

అయితే ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. ఆయన తన మేనకోడలితో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారని  కొందరు రాయగా.. ఫిజియోథెరపిస్ట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు మరికొందరు ప్రచారం చేశారు. ఈ వార్తలపై ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం స్పందించారు. ‘మీ వద్దే సమాచారం అంతా ఉంది. ప్రభుదేవా పెళ్లి పట్ల మా కుటుంబ సభ్యులంతా చాలా హ్యాపీగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.

ముంబైలో నివాసం ఉంటున్న డాక్టర్ హిమనిని ప్రభుదేవా పెళ్లి చేసుకున్నారట. డ్యాన్స్‌ చేస్తున్న క్రమంలో ప్రభుదేవా కాలికి, వెన్నెముకకు తరచూ స్వల్ప గాయాలు అవుతుండేవి. ఆయనకు హిమని ట్రీట్మెంట్ అందించేవారట. రెండు నెలలు వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. కాగా కోవిడ్ నేపథ్యంలో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో పెళ్లి జరిగిందట.  ఈ వార్తలపై స్పందించిన రాజుసుందరం ” ప్రభుదేవా 1995లో రామలతను పెళ్లి చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత విబేధాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు హిమనిని రెండో పెళ్లి చేసుకున్నారు” అని చెప్పారు.

ఇక ప్రస్తుతం ప్రభుదేవా సల్మాన్ ఖాన్ హీరోగా రాధే సినిమా తెరకెక్కిస్తున్నాడు. దబంగ్ 3 ఫ్లాప్ అయినా కూడా మరోసారి ఈయనకు అవకాశం ఇచ్చాడు సల్మాన్. ఏదేమైనా కూడా ప్రభుదేవా రెండో పెళ్ళి మ్యాటర్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: