బిగ్ బాస్ సీజన్ 4 నుండి టాప్ యాంకర్ లాస్య ఎలిమినేట్ అయినట్టు టాక్. 11వ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో ఆ ఆరుగురిలో సోహెల్ ను సేఫ్ చేశాడు నాగార్జున. ఇక మిగిలిన ఐదుగురిలో లాస్యను అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమెను హౌజ్ నుండి పంపించేశారని తెలుస్తుంది. హౌజ్ లో లాస్య ఆట ఆడకుండా కేవలం వంట చేయడానికి మాత్రమే వచ్చినట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆమె తన వాయిస్ వినిపించడంలో కూడా వెనకపడ్డది.

లాస్య ఓ మంచి కంటెస్టంట్.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కాని లాస్య టాస్కుల్లో పెద్దగా పర్ఫార్మ్ చేయకపోవడం ఆమెకు మైనస్ గా మారింది. అడపాదడపా మోనాల్ అయినా టాస్కుల కోసం రిస్క్ తీసుకుంటుంది కాని లాస్య అది కూడా చేయలేదు. అందుకే లాస్యని హౌజ్ నుండి అయినట్టు తెలుస్తుంది. అయితే సీజన్ 3లో టాప్ యాంకర్ శ్రీముఖి కూడా బిగ్ బాస్ కు రాగా ఆమె ఫైనల్ వరకు వెళ్లింది. శ్రీముఖి వల్ల అయ్యింది లాస్య వల్ల ఎందుకు కాలేదు అంటే.. శ్రీముఖి మగాళ్లతో సమానంగా టఫ్ ఫైట్ ఇస్తూ వచ్చింది.

అందుకే ఆమె నామినేషన్స్ లో ఉన్నా ఎక్కువ ఓట్లు వేసి ఆమెను సేఫ్ చేశారు. కాని లాస్య విషయంలో ఆడియెన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. లాస్య తర్వాత ప్లేస్ లో మోనాల్ గజ్జర్ ఉంది. ఆమె నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉంటే మాత్రం నెక్స్ట్ ఆమే హౌజ్ నుడి బయటకు వచ్చేస్తుందని అంటున్నారు. మొత్తానికి ఒకప్పుడు టాప్ యాంకర్ అయిన లాస్య ఈరోజు బిగ్ బాస్ నుండి ఎగ్జిట్ అవుతుందని టాక్.                     

మరింత సమాచారం తెలుసుకోండి: