మెగా ఫ్యామిలీలో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్ కు చిరంజీవి నుండి అందరు వచ్చినా మీడియా వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు అంటూ వార్తలు రాస్తాయి. అంతేకాదు మళ్ళీ పవన్ మెగా కాంపౌండ్ కు దూరం అవుతున్నాడా అంటూ ఊహాగానాలు మొదలుపెడతాయి.


సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేసే ఈ వార్తలను కట్టడి చేయాలని ముందుగానే నిహారిక భావించినట్లుంది. అందుకే తెలివిగా ఆమె వ్యక్తిగతంగా తన పెళ్ళి పిలుపులను తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ప్రారంభించినట్లు తెలుస్తోంది. పవన్ సాధారణంగా తన ఇంటిలో జరిగే పెళ్ళిళ్ళకు వెళ్ళడు.


గతంలో చిరంజీవి షష్టిపూర్తి జరిగినప్పుడు కూడ చివరి వరకు సస్పెన్స్ కొనసాగించి చిరంజీవి ఇంటికి వచ్చాడు. అలాంటి మనస్తత్వం ఉన్న పవన్ దగ్గర మాట తీసుకోవడం కోసం నిహారిక పవన్ ఇంటికి వెళ్ళి తన పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అని మాట తప్పకూడదు అని నిహారిక మాట తీసుకుందట. దీనితో పవన్ నిహారికకు మాట ఇవ్వడమే కాకుండా ఆమె పెళ్ళి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి పెళ్ళికి ముందు రెండు మూడు సార్లు తన అన్న నాగబాబు ఇంటికి వచ్చి అన్నీ తెలుసుకుంటాను అంటూ కూతురుకు జోష్ ను ఇచ్చే మాటలు చెప్పి ఆమెను సాగనింపాడట.


దీనితో నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటు అప్పుడే సోషల్ మీడియాలో సందడి మొదలైపోయింది. చివరి నిముషంలో పవన్ కళ్యాణ్ నిహారిక కు ఇచ్చిన మాట ఎంత వరకు నిలబెట్టుకుంటాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ నిహారిక పెళ్ళిలో పవన్ హడావిడి ఉండబోతోంది అంటూ అప్పుడే అతడి అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టేసారు. మెగా ఫ్యామిలీలో నిహారిక ను ఇష్టపడని వారు ఉండరు. దీనితో పవన్ కళ్యాణ్ కూడ నిహారిక కు ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటాడు అంటు పవన్ అభిమానుల నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: