బిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్నారు మోనాల్ గజ్జర్. తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరు సర్ ప్రైజ్ అయ్యారు. అయితే మోనాల్ హౌజ్ లో 11 వారాల జర్నీలో ఎక్కువగా అఖిల్ తోనే కనిపించింది. ఆమె ఏం చేసినా అఖిల్ కోసమే అన్నట్టుగా టాక్ వచ్చింది. మొదట్లో మోనాల్ కోసం అఖిల్, అభిజిత్ కొట్టుకోవడం ఆ తర్వాత అఖిల్ కు క్లోజ్ అవడం అంతా తెలిసిందే.

అయితే మోనాల్ ఇప్పటికీ హౌజ్ లో ఉండటం అనేది కొందరికి డౌట్ అని అంటున్నారు. ఆడియెన్స్ ఆమెను ఎందుకు సేఫ్ చేస్తున్నారన్నది ఎవరికి అర్ధం కావట్లేదు. బిగ్ బాస్ సీజన్ 4లో మోనాల్ ప్రతి వారం నామినేషన్స్ లో ఉండటం ఆడియెన్స్ ఆమెను సేఫ్ చేయడం జరుగుతుంది. ఈ వారం అఖిల్ నుండి సెపరేట్ గా ఆమె ఆట ఆడుతుంది. అయితే బిగ్ బాస్ నుండి ఈ వారం అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిలో మోనాల్, లాస్య ఉన్నారు. అయితే ఈవారం కూడా మోనాల్ ను సేవ్ చేసి లాస్యని హౌజ్ నుండి పంపించేస్తున్నారని తెలుస్తుంది.

సో బిగ్ బాస్ కు మోనాల్ అంటే అంత ఇష్టం ఎందుకో టాస్కులు సరిగా చెయకపోయినా సరే మోనాల్ హౌజ్ లో సర్ వైవ్ అవుతూనే వస్తుంది. అయితే ఈ వారం అఖిల్ కు దూరంగా వచ్చేసిన మోనాల్ అనుకున్నట్టుగానే ఈ వారం సేఫ్ అయితే ఇక నుండైనా తన ఆటతో అందరిని అలరించాలని ఆశిస్తున్నారు ఆడియెన్స్. మోనాల్ కు ఆడియెన్స్ స్సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె కొద్దిగా టాస్కుల్లో పర్ఫాం చేస్తే టాప్ 5లో ఉంచినా ఉంచుతారని తెలుస్తుంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: