బిగ్ బాస్ సీజన్ ఫోర్ కధ క్లైమాక్స్ కి వచ్చేస్తోంది. ముగ్గురు వైట్ కార్డ్ ఎంట్రీస్ తో కలుపుకుని మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఈసారి బిగ్ బాస్ లో ఉన్నారు. అయితే ఇందులో ఇప్పటికి పదకొండు మంది హౌజ్ విడిచి వెళ్ళిపోయారు. మిగిలింది ఎనిమిది మంది ఈ రోజుతో ఒకరు వెళ్తే ఇక ఏడుగురే ఉంటారు. అంటే టాప్ ఫైవ్ కి రంగం సిధ్ధమైంది అన్న మాట.

బిగ్ బాస్ హౌజ్ లో ఈసారి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరా అన్నది అందరికీ ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే అందరూ బాగానే ఆడుతున్నారు. దాదాపుగా సమానంగానే ఉన్నారు. దాంతో హౌజ్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ద్వారా ఓటింగు ను బిగ్ బాస్ తీసుకున్నాడు. వారి అంచనా ప్రకారం చూసుకుంటే బిగ్ బాస్ లో ఈసారి కచ్చితంగా అయిదుగురు టాప్ ఫైవ్ లోకి వెళ్తున్నారు.

ఆ లిస్ట్ ల అభిజిత్, సోహెల్, అఖిల్, దేత్తడి హారిక ఆరియానా ఉన్నారు. మిగిలిన వారు వచ్చే వారాలో హౌజ్ వీడి బయటకు రావాల్సిందే. ఈ ఓటింగ్ దాదాపుగా న్యాయంగానే ఉందనిపిస్తోంది. ఎందుకంటే హౌజ్ మేట్స్ పేరెంట్స్, ఫ్రెండ్స్ గా వారు ఉన్నా వారు కూడా షోని చూస్తూ ఒక కామన్ ఆడియన్ గానే ఓటు వేశారు.

హౌజ్ లో కంటెస్టెంట్ల మధ్యన  గొడవలు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా తమ వాడికి హౌజ్ లో మరొకరికి పడదు అన్నది కూడా మనసులోకి తీసుకోకుండా వీరంతా చాలా పారదర్శకంగానే ఓటు చేశారు. దీంతో టాప్ ఫైవ్ లిస్ట్ రెడీ అయింది. ఇందులో మార్పులు చేర్పులు ఉంటే అవినాష్, ఆరియానాల మధ్యన అటూ ఇటూ ఉండొచ్చేమో కానీ మిగిలిన నలుగురూ మాత్రం కచ్చితంగా ఉంటారని కూడా చెప్పేయవచ్చు. సో అసలైన ఆట మొదలైంది ఇప్పుడే. ఇక చూడాల్సిందే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: