నటుడు, నిర్మాత, రచయిత krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అంటే ముక్కు సూటిగా మాట్లాడే మనిషి.. ఏదైనా కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే మనిషి. అందుకే ఆయనతో ఎవరైనా పెట్టుకోవాలని అనుకుంటే అది వాళ్ళకే రిస్క్ అని చెప్పాలి. అయితే పోసాని ఇప్పుడు తెలంగాణ లో జరగనున్న గ్రేటర్ ఎన్నికల పై స్పందించి తన దైన శైలిలో స్పందించాడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.. రాజకీయ చర్చలకు కూడా దారి తీస్తున్నాయి.. 



జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకే ఓటేసి గెలిపించాలని కోరారు సినీనటుడు పోసాని కృష్ణ మురళి. మేయర్ పీఠం టీఆర్ఎస్‌కు దక్కితేనే హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూడా రాష్ట్రం అలానే ఉండాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వం ఉండాలని అంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ పాలనలోనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు పోసాని.




కేసీఆర్ అధికారం లోకి వచ్చాక తెలంగాణ అంతటా పచ్చదనం పరుచుకుందని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కేవలం ఆంధ్రా నాయకుల మీదే కోపాన్ని ప్రదర్శించారని, ప్రజలపై కాదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆంధ్రా ప్రజలను హైదరాబాద్ నుంచి తరిమికొడతారన్న అసత్య ప్రచారం చేశారని, ఈ ఆరేళ్ల లో అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. లక్ష కోట్ల తో దేశంలోనే గొప్పదిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టడం కేసీఆర్‌కే సాధ్యమైందని పోసాని అన్నారు. ఇటీవల హైదరాబాద్ ‌లో వచ్చిన వరదలను అవకాశంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.. వందేళ్ల క్రితం ఇంతకన్నా కూడా పెద్ద వరదే వచ్చి ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు.. కేసీఆర్ మళ్లీ గెలిస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: