బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేత ఎవరు అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఇక కచ్చితంగా నెల రోజుల వ్యవధి కూడా లేదు. డిసెంబర్ 20వ తేదీతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముగుస్తోంది. బిగ్ బాస్ లో ఈసారి ఎవరు విజేతగా పతాక ఎగురవేస్తారు అన్నది అతి పెద్ద చర్చగానే ఉంది. ఈసారి కరోనా ఓవైపు లాక్ డౌన్ నిబంధనలు ఉన్నా కూడా బిగ్ బాస్ సీజన్ ఫోర్ మొదలైంది.

ఎటువంటి ఆటంకాలు లేకుండా షో సాగుతోంది. జనాలు కూడా గతంతో పోలిస్తే ఈసారి షోను ఎక్కువగా ఆదరించారు. దానికి కారణం వినోదం అన్నది బయట పెద్దగా లేకపోవడం. థియేటర్లు బంద్, కరోనా భయాలతో ఇంట్లోనే కూర్చుని అంతా ఠంచనుగా బిగ్ బాస్ షోని చూస్తూ గడిపారు.

దాంతో ఏ సీజన్ కి లేనంత ఆదరణ ఈసారి దక్కింది.ఇక ఈసారి తెలిసిన ముఖాలు లేవు. అంతా కొత్త వాళ్ళు. దాంతో షో కూడా ఫ్రెష్ గా ఉంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలో టాప్ ఫైవ్ ఎవరో దాదాపుగా తెలిపోయింది. ఇక విన్నర్ ఎవరు అన్నది కూడా అంచనాలు మొదలయ్యాయి. అందరి అంచనాలూ చూసుకుంటే విన్నర్ అయ్యేది కచ్చితంగా అభిజిత్ అని అంటున్నారు.

అభిజిత్ తనదైన మైండ్ గేమ్ తో ఈసారి షోని ఆకట్టుకున్నాడు. ఎమోషన్స్ ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడమే కాదు, తనను తాను మౌల్డ్ చేసుకున్న తీరు, లాజిక్ తో ప్రతీ దాని మీదా  మాట్లాడుతున్న వైనం కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక బిగ్ బాస్ లో పక్కా మాస్ గా సోయెల్ సయ్యద్ ఉన్నాడు.

అతని యాటిట్యూడ్ తోనే బిగ్ బాస్ లో ఫుల్ ఫ్యాన్స్  ని సంపాదించుకున్నాడు. అలాగే  సోహెల్ కి బయట మంచి మద్దతు ఉంది. దాంతో ఈ ఇద్దరి మధ్యనే టైట్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. సోహెల్ విజేత అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటారు. అలాగే అభిజిత్ కి కూడా అంతే చాన్స్ ఉంది. దాంతో వచ్చే నెల 20వ తేదీ వరకూ ఇది సస్పెన్స్ గానే ఉండబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: