ఓ వైపు తన దర్శకత్వం వహించిన సినిమాలను ప్రపంచం నలు మూలలకు విస్తరింపజేసి తెలుగు సినిమాల కీర్తిని పెంచిన  ఘనుడు సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగు పెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైనమిక్ యంగ్ హీరో ఎన్టీఆర్.. ఇంకోవైపు మెగా ఇంటి వారసుడిగా బరిలోకి దిగి..... తన నటనతో, మెలికలు తిరిగే స్టెప్పులతో అభిమాన సైన్యాన్ని పెంచుకుని తనకంటూ కొత్త గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో రామ్ చరణ్.....

ఇలా ఈ ముగ్గురు మగధీరులు కలసి ఒకే ప్రాజెక్ట్ చేయడం అంటే ఒక ప్రభంజనం అనే చెప్పాలి. ప్రస్తుతం వీరు కలసి ఆర్.ఆర్.ఆర్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పూటకో హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో సంచలన వార్తను మన ముందుంచారు దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమా బ్రిటిష్ వారు  కాలానికి చెందిన కథతో రూపు దిద్దుకుంటున్న  నేపద్యంలో హాలీవుడ్‌ యాక్టర్స్‌ కూడా నటిస్తున్నట్లుగా రాజమౌళి తెలిపారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో.. హాలీవుడ్‌ యాక్టర్స్‌ జాయిన్‌ అయినట్లుగా సమాచారం.

పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన రేస్టీవెన్ సన్ ఈ చిత్రంలో స్కాట్ గా నటిస్తుంటే, అతని భార్య పాత్రలో అలిసన్ డూడీ కనిపించనుందట. వీరిద్దరూ ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్‌లో జాయిన్‌ అయినట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. మరోవైపు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందంటూ అభిమానులు ట్రోల్ చేస్తూ సందడి చేస్తున్నారు. "రౌద్రం రణం రుధిరం" సినిమా ఎప్పుడెప్పుడు తమ కళ్లముందుకు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: