ఒకప్పుడు సినిమాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది కానీ ప్రస్తుతం డిజిటల్ వేదిక  అంతకంతకు క్రియేట్ సంపాదిస్తూ ప్రేక్షకులను ఆకర్షించింది అన్న విషయం తెలిసిందే. సినిమాలను ఆన్ లైన్ లో విడుదల చేయడంతో పాటు ప్రస్తుతం ఎన్నో రకాల వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఓటిటి  ప్లాట్ ఫామ్ లకు ఆకర్షితులు అవుతున్నారు దీంతో దేశంలో రోజురోజుకు డిజిటల్ వేదికలు పుంజుకుంటున్నాయి . ఈ మధ్య కాలంలో అయితే సినిమాల కంటే వెబ్ సిరీస్ ల చూడటానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు సినీ ప్రేక్షకులు.



 సినిమాల్లో అయితే ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అదే వెబ్ సిరీస్ లో అయితే... ఎన్నో వైవిధ్యమైన కథను తెరకెక్కించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే అటు సినీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో  నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఓవైపు సినిమాల్లో  కమర్షియల్ హీరోగా నటిస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రలో వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎంత మంది బాలీవుడ్ స్టార్స్ ఈ కోవలో వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు.



 ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది అనే విషయం తెలిసిందే.  దీంతో ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏకంగా కమర్షియల్ సినిమా రేంజ్ లో ఈ వెబ్ సిరీస్ భారీ యాక్షన్ సన్నివేశాలతో ఉండబోతోందని తెలుస్తోంది. హృతిక్ రోషన్ కీలకపాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందట. మొత్తంగా ఆరు ఎపిసోడ్లు ఉండబోతుందట ఈ వెబ్ సిరీస్. అయితే సినిమా రేంజ్ లో ఈ వెబ్ సిరీస్ కోసం హృతిక్ పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏకంగా 90 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట హృతిక్ రోషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: