ఈ ఏడాది కరుణవల్ల జనం జీవనం చాలా నెలల పాటు స్తంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా సామాన్య ప్రజలకు అనేక కష్టనష్టాలు తెచ్చిపెట్టినా సినీ సెలబ్రిటీలకు మాత్రం ఒక విషయంలో మంచి చేసింది. వాళ్లకి చాలా రెస్ట్ దొరకడం తో పాట ఇప్పుడు వరకు పెళ్లిళ్లలో వాయిదా వేసుకుంటూ వచ్చిన వాళ్లు సైతం పెళ్లి పీటలు ఎక్కేశారు, టాలీవుడ్ విషయానికి వస్తే దగ్గుబాటి రానా మొదలు నితిన్, నిఖిల్, మెగా డాటర్ నిహారిక లాంటి వాళ్లు సైతం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, 

మొన్నటికి మొన్న చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోగా తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కళ్యాణ్ రామ్ కత్తి అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ సనాఖాన్. తెలుగులో కత్తి, మిస్టర్ నూకయ్య లాంటి సినిమాలు చేసిన ఈ భామ ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన ఈమె హిందీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నటించి మంచి పేరు సంపాదించింది. 

అయితే ఈమె త్వరలోనే సినిమాలు గుడ్ బాయ్ చెబుతున్నాను అంటూ మొన్నీమధ్య ప్రకటించింది. ఆమె సడన్ గా ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఈ భామ. ఆమె ఇటీవలే గుజరాత్లోని సూరత్ కు చెందిన అనే వ్యక్తిని ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో సనాఖాన్ పెళ్ళి కుమార్తె బట్టల్లో ఉండగా నిఖా  ముబారక్ అని రాసి ఉన్న చాక్లెట్ కేక్ ని సనాఖాన్ తన భర్తతో కలిసి కట్ చేశారు. ఇక ఈమె తర్వాత పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: