మెగా వారసురాలు కొణిదెల నిహారిక మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల  డిసెంబర్ 9వ తేదీన నిహారిక వివాహం ఘనంగా జరగనుంది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైత్యన్యతో నిహారిక వివాహం నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు.ఐతే నిహారిక నిశ్చితార్ధ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. నిహారిక నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో జరిగిన నితిన్ పెళ్ళికి వెళ్లిన పవన్...నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకకు రాలేదు. కారణాలేమైనా కానీ కూతురు నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం ఒకింత వెలితిగా అనిపించింది.

నిశ్చితార్ధానికి రాకున్నా, పెళ్ళికి ఎలాగైనా పవన్ వచ్చేలా నిహారిక మరియు నాగబాబు జాగ్రత్తలు తీసుకున్నారట.ముఖ్యంగా ఈ విషయంలో నిహారికనే స్వయంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి.. ఎట్టి పరిస్థితుల్లోనూ తన పెళ్లికి రావాలని ఈ విషయంలో  పవన్ కళ్యాణ్ దగ్గర మాట తీసుకుందట. దీనికి పవన్ కళ్యాణ్ పెళ్ళికి ఖచ్చితంగా వస్తానని నిహారిక కు  చెప్పారట.అందుకు పవన్ తన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ని సైతం పక్కన పెట్టి నిహారిక పెళ్లికి హాజరు కానున్నాడు. అంతేకాదు పెళ్లికి రెండు రోజుల ముందే చేరుకొని, పెళ్లి పనులు చూసుకుంటాను అన్నారట.ఇక నిహారిక పెళ్లిని గ్రాండ్ గా సెట్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నందు గల ఉదయ్ పూర్ ప్యాలస్ నందు నిహారిక-చైతన్య వివాహం జరగనుంది.

 డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనున్న ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారు. మెగా హీరోలందరూ తమ సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి.. నీహారిక పెళ్లికి హాజరై సందడి చేయనున్నారు. ఇక తన పెళ్లి కోసం అందరూ తమ షూటింగ్ లను పక్కనపెట్టి మరీ వస్తున్నందుకు ఈ మెగా డాటర్ చాలా సంతోషంగా ఉందని.. అంతే హ్యాపీ మూడ్ తో పెళ్లికి రెడీ అవుతుందట.ఇక ఈమె పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటుగా ఇండ్రస్టీ నుంచి అతి కొద్ది మంది ప్రముఖులు హాజరు కానున్నారని మెగా కాంపౌండ్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: