ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా రౌద్రం రణం రుధిరం. తొలిసారిగా మెగా హీరో రామ్ చరణ్, అలానే నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్రప్రసాద్ కథని సాయిమాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని డీవివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా అలానే ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఎముకలు కొరికే చలి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్కచేయకుండా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొనసాగిస్తోంది యూనిట్. అందుతున్న సమాచారాన్ని బట్టి సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం గట్టిగా కనపడుతుంది. ఇక మరో వైపు కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. మొదటి భాగాన్ని మించేలా ఈ రెండో భాగాన్ని దర్శకనిర్మాతలు మరింత అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మరింత పెండింగ్ ఉండటంతో సినిమాని మరికొన్నాళ్ళు పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ రెండు సినిమాల విషయమై లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ముందుగా వేసవి తర్వాత ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుందని అంటున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత అప్పటి వరకూ వున్న పాత రికార్డులన్నీ చాలావరకు బద్దలయ్యే అవకాశం కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు, ప్రేక్షకులు. కానీ ఆ తర్వాత మరికొద్ది గ్యాప్ లోనే కె ఎఫ్ చాప్టర్ 2 కూడా విడుదల అవుతుండటంతో అది చాలావరకు ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ కూడా లేకపోలేదని, ఇప్పటికే ఆ సినిమా పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే గనుక జరిగితే ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్స్ ఎక్కువ కాలం పదిలంగా ఉండే చాన్స్ లేదనే చెప్పాలి. మరి ఈ రెండు సినిమాల విషయంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయకతప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: