ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు దాదాపుగా చాలామంది ఎవరికి వారు సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకొని ఆయా బ్యానర్స్ పై సినిమాలు చేస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థను నెలకొల్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ బ్యానర్ పై శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు నిర్మించారు. అలాగే ప్రస్తుతం అదే బ్యానర్ పై ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సంస్థ ని స్థాపించిన పవన్ కళ్యాణ్ అతి త్వరలో పలువురు హీరోలతో సినిమాలు నిర్మించనున్న విషయం తెలిసిందే.

ఇక వీరితో పాటు తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్  ఆర్ట్స్ సంస్థలో ఇకపై వరుసగా సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలానే వీరితోపాటు గోపీకృష్ణ మూవీస్ సంస్థ పై ప్రభాస్ అలానే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా చాలామంది టాలీవుడ్ హీరోలు సైతం ఎవరికి వారు సొంత నిర్మాణ సంస్థల పైన ఎక్కువగా సినిమాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే వారు ఈ విధంగా సొంత సంస్థల పై సినిమాలు చేయడానికి ఒక బలమైన కారణం ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.

ఇక వారు చెపుతున్న వివరాలను బట్టి చూస్తే ఎవరైనా హీరో తన సొంత నిర్మాణ సంస్థ పై సినిమా కనుక చేస్తే ఒకవేళ ఆ సినిమా బాగా ఆడింది అంటే  దానిపై వచ్చిన లాభాలు బాగా అందిపుచ్చుకోవచ్చు. అదే ఒకవేళ  ఆ సినిమా ఫెయిల్ అయినట్లయితే నష్టాలు వారే భరించే అవకాశం కొంతవరకు ఉంటుందని తద్వారా బయటి నిర్మాతలు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అనేది వారి భావన అని అంటున్నారు. ఒకరకంగా ఈ ఆలోచన టాలీవుడ్ హీరోల్లో రావటం మంచి పరిణామమేనని ఎందుకంటే ఒకవేళ భారీ బడ్జెట్ సినిమాలు వాళ్ల సొంత బ్యానర్ పై తెరకెక్కి ఫ్లాప్ అయితే వాటికి వచ్చే నష్టాలను వారే భరిస్తారు తప్ప వేరొకరు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి అవసరం ఉండదని, అలానే ఆ విధంగా సొంతంగా సినిమాలు నిర్మిస్తున్న పలువురు హీరోలు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు లాభాల్లో వాటాలతో పాటు నష్టాల్లో భాగం పంచుకునేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: