స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అలవైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా దీనిని గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎస్.రాధాకృష్ణ అలానే అల్లు అరవింద్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించడం జరిగింది.

ఇక దీని అనంతరం ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకులు అలానే అభిమానులకు చేరువ అవుతూ తన సినీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అలవాటు ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిన్న తన ముద్దుల తనయ అర్హ బర్త్ డే సందర్భంగా ఆమెకు ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు.

కొన్నేళ్ళక్రితం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో బేబీ షామిలి పై చిత్రీకరించిన అంజలి అంజలి అనే పల్లవితో సాగే సూపర్బ్ సాంగ్ ని అచ్చంగా అదే రీతిన తన కూతురు అర్హ పై చిత్రీకరించి దానిని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్ లో దాదాపుగా మిలియన్ కి పైగా వ్యూస్ తో అద్భుతమైన రెస్పాన్స్ తో కొనసాగుతోంది. ఇక నిన్న జరిగిన అర్హ బర్త్ డే వేడుకకు పలువురు సినిమా ప్రముఖులు హాజరై సందడి చేయడం జరిగింది. ఎంతైనా స్టైలిష్ స్టార్ కాబట్టి ఆయన కూతురు అర్హ పుట్టినరోజు కి ఆ మాత్రం హడావుడి అవసరమే కదా అంటూ పలువురు అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: