స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లర్ నేపద్యంలో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ అనే మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. గతంలో రంగస్థలం సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న సుకుమార్సినిమా కథను కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో అద్భుతంగా రాసుకున్నారని సమాచారం.

లాక్ డౌన్ కి ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ రెండు సినిమాలలో నటించనున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఐకాన్ ఒక సినిమా కాగా మరొకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇటీవల ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారికంగా ప్రకటనలు కూడా రావడం జరిగింది.  

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో అల్లు అర్జున్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న యాక్షన్ సినిమాకు సంబంధించి పూర్తి కథా కథనాలు ఇటీవల సిద్ధమైనట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని ఆయన సరసన హీరోయిన్ గా కొద్ది రోజుల క్రితం ఒక బాలీవుడ్ భామను ఎంపిక చేసిందట మూవీ యూనిట్. ఇటీవల బాలీవుడ్ లో మంచి హిట్స్ తో దూసుకుపోతున్న ఆమె బన్నీతో సినిమా అనగానే ఎగిరి గంతేసిందని అలాగే అతి త్వరలో ఆమె ఎంపిక విషయమై అధికారికంగా ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో  తెలియాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు ఆగక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: