టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా 350 పైగా సినిమాల్లో నటించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన లెజండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ. తొలితరం సూపర్ స్టార్ లైన ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కృష్ణ ప్రభంజనం దాదాపుగా ఒకటిన్నర దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో కొనసాగింది. అప్పట్లో మాస్ చిత్రాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేయడంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన కృష్ణ అప్పటి యువతలో విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు అప్పట్లో ఎన్నో రకాల సరికొత్త హంగులను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ.

ఇకపోతే కొన్నాళ్ల క్రితం ఆయన తనయుడు మహేష్ బాబు టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తండ్రిని  మించిన తనయుడుగా భారీస్థాయి హిట్స్ తో అద్భుతమైన పేరు, పాపులారిటీ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న నేటి కాలంలో ఎక్కువ శాతం బయోపిక్ లు వస్తున్నాయి. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాక పలు ఇతర భాషల్లో కూడా పలువురు ప్రముఖుల పై బయోపిక్ సినిమాలు తీస్తున్నారు. అయితే వాటిలో చాలా వరకు సక్సెస్ అవుతున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. ఇటీవల తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు రెండూ పెద్దగా సక్సెస్ కానప్పటికీ మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీ మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక కొన్నాళ్ల నుండి పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తుంటే అతి త్వరలో సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు అద్భుతమైన రీతిలో కృష్ణ జీవితాన్ని కథగా మార్చి సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. కాగా దీనికి ఒక యువ ఒక దర్శకుడు దర్శకత్వం వహించనున్నారని అయితే ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు ఇతర పాత్రలు ఎవరు చేస్తారు అనే విషయాలు ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఇందులో మహేష్ హీరోగా నటిస్తారని  కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇందులో ఆయన హీరో కాదని ఒక ప్రత్యేకమైన పాత్రలో కొన్ని క్షణాలు మాత్రమే కనిపిస్తారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి వీటికి సంబంధించి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: