భారత్‌ లో ఓటీటీ మాధ్యమం పాపులర్ అవుతుందని కచ్చితంగా తెలిసినా.. దానికి చాలా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం, లాక్‌ డౌన్ లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాల్సి రావడంతో ఓటీటీలకు ప్రజాదరణ బాగా పెరిగింది. దీంతో భారీ నిర్మాణ సంస్థలు ఓటీటీ ప్లాట్‌ఫాంపై వెబ్ సిరీసులు, సినిమాలు నిర్మించడానికి ముందుకొస్తున్నాయి. భారీ బడ్జెట్లు పెట్టడానికి కూడా ఈ సంస్థలు వెనుకాడటం లేదు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా ఓ యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ తీయాలని ఓ పెద్ద నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉంటాయట. వీటన్నింటిలోనూ అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం సదరు నిర్మాణ సంస్థ 250 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికి అంగీకరించిందట. మరి ఇంత భారీ సిరీస్‌ లో నటిస్తున్న హృతిక్ రోషన్ ఊరుకుంటాడా? దీనికి తాను కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఎంతో తెలుసా? ఏకంగా 90 కోట్ల రూపాయలు. ఈ మొత్తం చెల్లిస్తేనే తాను వెబ్ సిరీస్ లో నటిస్తానని కుండ బద్దలు కొడ్డాడట హృతిక్.

దానికి సదరు నిర్మాణ సంస్థ ఒప్పుకుందట కూడా. ఓ ఇండియన్ స్టార్ వెబ్ సిరీస్ కోసం ఇంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం ఇదే తొలిసారి. వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో కూడా ఏ నటుడూ ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం జరగదని మార్కెట్ నిపుణల అంచనా. మామూలుగా సినిమాలకు బడా బడా స్టార్లు ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఓ వెబ్ సిరీస్‌కు ఈ స్థాయిలో డిమాండ్ చేయడం ఏంట్రా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇంత సొమ్ము ఇవ్వడానికి సదరు సంస్థ ఒప్పుకుందంటే.. భారత్‌లో ఓటీటీ బిజినెస్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చని మరికొందరు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: