నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండు మూడు సినిమాలతోనే రికార్డులతో ఆడుకోవడం తారక్ కు అలవాటుగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో బాక్సాఫీస్ షేక్ చేయగల సత్తా ఉన్న వారిలో తారక్ ఒకడు. అలాంటి ఎన్.టి.ఆర్ ఎనర్జీ గురించి తన తోటి హీరోలు.. హీరోయిన్స్ బాగా చెప్పుకుంటారు. లేటెస్ట్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే కూడా ఎన్.టి.ఆర్ తో ఆ అనుభవం గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్, పూజా హెగ్దే కలిసి అరవింద సమేత సినిమాలో నటించారు. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా తనకు చాల ప్రత్యేకమైనదని అంటుంది పూజా హెగ్దే. తారక్ తో కలిసి నటించే అవకాశం ఈ సినిమాతో వచ్చిందని ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించిదని అన్నారు పూజా. తారక్ తో ఈక్వల్ గా ఎనర్జీ లెవల్స్ మెయింటైన్ చేశానని అంటుంది ఈ అమ్మడు. దాని వల్లే ఆన్ స్క్రీన్ లో మా జోడీ బాగుందని అంటుంది.

తారక్ తో ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎన్నో అనుభవాలు అందించిందని చెప్పుకొచ్చింది పూజా హెగ్దే. ప్రస్తుతం తెలుగులో వరుస స్టార్ సినిమాలను చేస్తున్న పూజా హెగ్దే ఐదారేళ్లు తన హవా కొనసాగించేలా ఉంది. ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: