బిగ్ బాస్ సీజన్ 4లో 11వ వారం లెక్కలన్ని మారాయి. అనూహ్యంగా ఆదివారం లాస్య ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. ఈవారం ఆరుగురు నామినేట్ అవగా వారిలో లాస్యకు అతి తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. నిన్నటివరకు ఈ వారం మోనాల్ హౌజ్ నుండి వెళ్తుందని అనుకోగా ఆమెని మరోసారి సేవ్ చేశారు ఆడియెన్స్. ఇదిలాఉంటే లాస్య బయటకు వెళ్లడం వల్ల టాప్ 5లో ఉండే హౌజ్ మేట్స్ ఎవరన్నది కొద్దిగా టఫ్ ఫైట్ జరుగుతుంది.

అయితే ఎవరెలా ఉన్నా లాస్య బయటకు వెళ్ళడం వల్ల హారికకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టే అని చెబుతున్నారు. అభిజిత్, సోహెల్, అఖిల్ ముగ్గురు టాప్ 5లో బెర్త్ కన్ ఫాం చేసుకున్నట్టే అంటున్నారు. వీరితో పాటుగా అరియానా కూడా టాప్ 5లో పక్కా అని తెలుస్తుంది. లాస్య ఉంటే హారికకు టఫ్ అయ్యేది కాని లాస్య ఎగ్జిట్ అవడం వల్ల అవినాష్ తో తను పోటీ పడుతుంది. ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా సరే మోనాల్ ఎలిమినేట్ అవుతుంది. లాస్య ఎలిమినేట్ అవడమే ఆటలో చాలా ఛెంజెస్ తెస్తుంది.

అవినాష్ ఈలోగా స్ట్రాంగ్ అయితే మాత్రం అరియానా, హారికల మధ్య టాప్ 5 యుద్ధం జరుగుతుంది. హారికకు ఎలాగు బయట సోషల్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అంతేకాకుండా ఈవారం కెప్టెన్ కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉండదు. సో ఎలా చూసినా హారిక సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి టాప్ 5లో హారిక ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: