తమిళ్ స్టార్ తలపతి విజయ్ కి ఏ రేంజ్ క్రేజ్ వుందో ఇటీవల విడుదల అయిన మాస్టర్ టిజర్ మరొకసారి నిరూపించింది. ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ చిత్రం విజయ్ కు వుండే విపరీతమైన ఫాలోయింగ్ వల్ల భారీ అంచనాలను మాత్రం ఇంకా కోల్పోలేదు.

 అయితే ఇటీవలే విడుదల కాబడిన ఈ చిత్రం తాలూకా టీజర్ కు కూడా ట్రెండ్ సెట్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. వీటితో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన ఆల్బమ్ కూడా అంతే స్థాయి రెస్పాన్స్ ను అందుకుంది. ముఖ్యంగా మాస్ బీట్ "వాతి కమింగ్" అనే మాస్ సాంగ్ కు అయితే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

 ఇప్పుడు ఇదే పాటకు గాను ఏకంగా 90 మిలియన్ వ్యూస్ రావడంతో మేకర్స్ ఈ సాంగ్ ను మరోసారి స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ సాంగ్ ఈ మార్క్ అందుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా స్టార్ట్ చేసేసారు.ఈ సినిమాకు ఖైధీ సూపర్ హిట్ అందించిన లోకేశ్ కనకారాజ్ దర్శకుడు.అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడంతో అంచనాలు తార స్థాయిలో వున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: