తెలుగు బుల్లితెర మీద అందమైన యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. ఇంకా పెళ్లి కాని ఈ యాంకర్ అంటే అందరికి ఇష్టమే తన అల్లరితనంతో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3లో క్రేజీ కంటెస్టంట్ గా వచ్చి రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. అసలైతే 3వ సీజన్ శ్రీముఖి విజేతగా నిలుస్తుందని అనుకున్నారు కాన్ చివరి వారాల్లో రాహుల్ గ్రాఫ్ పెరగడంతో శ్రీముఖి సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక బుల్లితెర యాంకర్ గా తన టాలెంట్ తో అలరిస్తున్న అమ్మడు ఈమధ్య తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టినట్టు ఉంది. అందుకే బిగ్ బాస్ టైం లో కొద్దిగా బొద్దుగా కనిపించిన శ్రీముఖి ఈమధ్య సన్నబడినట్టుగా అనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా శ్రీముఖి ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యెల్లో కలర్ డ్రెస్ లో శ్రీముఖి హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువకాని అందం అనిపించేలా కనిపిస్తుంది.

అసలు శ్రీముఖి హీరోయిన్ గా ఎందుకు కొనసాగలేదు. మొదటి సినిమా ట్రై చేసి స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయ్యింది కాని అలానే కొనసాగితే మాత్రం శ్రీముఖి రేంజ్ వేరే లెవల్ లో ఉండేది. ఇప్పటికైనా శ్రీముఖి సూపర్ పాపులర్ అయ్యింది. ఆమె సోషల్ మీడియా ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. కొత్తగా స్లిం లుక్ తో దిగిన పిక్స్ మాత్రం బాగ వైరల్ అవుతున్నాయి. ఈ జోష్ లోనే కొత్త షోస్, కొత్త ప్రాజెక్టులతో శ్రీముఖి సందడి చేయాలని చూస్తుంది.                                                      
 

మరింత సమాచారం తెలుసుకోండి: