సూపర్ స్టార్ తో సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మహేష్ తో సినిమా చేయాలని అందరు దర్శకులు ప్రయత్నిస్తారు. అయితే వారిలో కొంతమందికి ఛాన్స్ దక్కుతుంది. అయితే మహేష్ తో సినిమా తీసి హిట్టు పడితే ఆ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తారు. ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ ఇచ్చాడు అనీల్ రావిపుడి. అనీల్ రావిపుడి కెరియర్ లో కూడా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అయితే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసే టైం లోనే అనీల్ రావిపుడి మరో కథ చెప్పాడట. ఆ కథ కూడా మహేష్ కు బాగా నచ్చిందట త్వరలోనే ఆ సినిమా కూడా ఉంటుందని అప్పట్లో అన్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనీల్ రావిపుడి మహేష్ తో సినిమా గురించి మాట్లాడారు. మహేష్ సర్ తో నేనెప్పుడైనా సినిమాకు రెడీ ఆయన నాకు జస్ట్ ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఉంటారు. మళ్లీ ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నా అని అన్నారు.

మహేష్ తో ఒక సూపర్ హిట్ సరిపోలేదు.. మళ్లీ మళ్లీ ఆయనతో సినిమా చేసి సూపర్ హిట్ ఇస్తా అంటున్నాడు అనీల్ రావిపుడు. ఇదే ఇంటర్వ్యూలో అనీల్ తనకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రాం గురించి కూడా చెప్పాడు. పటాస్ సినిమాతో అనీల్ కు డైరక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు కల్యాణ్ రాం. రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన అనీల్ డైరక్టర్ గా తన సత్తా చాటుతున్నాడు.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: