బిగ్ బాస్ సీజన్ 4 నుంది టాప్ యాంకర్ లాస్య ఎలిమినేట్ అయ్యింది. బుల్లితెర యాంకర్ గా ఆమెకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా పెళ్లి తర్వాత కొద్దిపాటి బ్రేక్ తీసుకుంది లాస్య అయితే కం బ్యాక్ కోసం బిగ్ బాస్ కు వచ్చిన ఆమె 11వ వారం ఎలిమినేట్ అయ్యింది. హౌజ్ లో రోజు రోజుకి కాంపిటీషన్ టఫ్ గా జరుగుతున్న టైం లో లాస్య కూడా తను బయటకు వెళ్లడం బెటరని భావించినట్టు ఉంది. అందుకే ఆమె వెళ్తుంటే పెద్దగా ఎమోషనల్ డ్రామా నడవలేదు.

లాస్య నవ్వుతూ హౌజ్ నుండి బయటకు వచ్చింది. అయితే బయటకు వచ్చినా సరే సేఫ్ గేం ఆడుతూ ఎవరిని నొప్పించకుండా మాట్లాడింది లాస్య. ఇక వెళ్తూ వెళ్తూ ఆమెని టాప్ 2లో ఎవరు ఉంటారని నాగార్జున అడిగితే ఆమె అభిజిత్, సోహెల్ అని చెప్పింది. అబ్జిత్ ఆమె ఫ్రెండ్ కాబట్టి అతని పేరు చెప్పగా టాప్ 2 లో అఖిల్, సోహెల్, హారిక, అరియానా వీరిలో ఎవరన్నది చెప్పడం కష్టం కాని లాస్య మాత్రం సోహెల్ టాప్ 2లో ఉంటాడని చెప్పేసింది.

అంటే ఆమె దృష్టిలో అఖిల్ టాప్ 2లో లేడని తెలుస్తుంది. అయితే టాప్ 5లో మాత్రం అవినాష్, హారిక ఉంటారని చెప్పింది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో అరియానా కన్నా నేను స్ట్రాంగ్ అన్న లాస్య ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఆమెతో పొటీ పడి బయటకు వచ్చేసంది. మరి లాస్య చెప్పినట్టుగానే బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 2లో వారిద్దరే ఉంటారా అన్నది చూడాలి.                                              
 

మరింత సమాచారం తెలుసుకోండి: