బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున ది బెస్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సీజన్ 3 హోస్ట్ గా సూపర్ హిట్ కొట్టిన నాగ్ సీజన్ 4కు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు. సీజన్ 4 మాత్రమే కాదు తెలుగు బిగ్ బాస్ కు పర్మనెంట్ హోస్ట్ గా నాగార్జునని ఫిక్స్ అవ్వొచ్చు. నాగార్జున యాంకరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కాని టీం రాసిచ్చిన స్క్రిప్ట్ మహిమో లేక మరేమో కాని హౌజ్ లో కొందరికి మాత్రమే నాగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అంటున్నారు.

ముఖ్యంగా అభిజిత్ మీదనే నాగార్జున దృష్టి ఉంటుంది. అతనికి డ్యాన్స్ రాదు కాని నాగార్జున అతన్ని డ్యాన్స్ వేయమని చెప్పి ఏదో అలా అలా కాలు కదపగానే సూపర్ డూపర్ అంటుంటాడు. అయితే నాగార్జునని.. ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న అవినాష్ మీద మాత్రం నాగార్జున పంచులు వేస్తున్నారు. అఫ్కోర్స్ అవి సరదాకే అయినా అభిజిత్ ఏం చేయకపోయినా అతన్ని పొగుడుతాడు.

ఒకవేళ బయట అభిజిత్ కు ఉన్న ఫాలోయింగ్.. అతనికి పడే ఓట్లు చూసి షో నిర్వాహకులు అలా కంటెంట్ రాస్తున్నారేమో కాని అది నాగార్జున ఫాలో అవుతూ అందరికి డౌట్ వచ్చేలా చేస్తున్నారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో కూడా అభిజిత్ వేసిన బుట్టబొమ్మ సాంగ్ డ్యాన్స్ సూపర్ అని నాగ్ స్పెషల్ గా మెన్షన్ చేశాడు. మరి నాగార్జున మరీ ఇంత స్పెషల్ గా చెప్పడం వెనక రీజన్స్ ఏమి లేకపొయిన సరే మిగతా హౌజ్ మేట్స్ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా నిరుత్సాహపడుతున్నారు.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: