ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ ఉన్న అభిజిత్ ఈ సీజన్ విజేతగా నిలుస్తాడని అంటున్నారు. అయితే మరో నెల రోజులు ఆట ఉంది. ఇంకా ముగ్గురు ఎలిమినేషన్స్ అవాల్సి ఉంది. టాప్ 5లో ఎవరు.. ఆ తర్వాత టాప్ 3లో ఎవరన్నది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఇదిలాఉంటే ఈ సీజన్ విన్నర్ గా ఇప్పటికే బాగా వినిపిస్తున్న అభిజిత్ తను హౌజ్ లోకి వెళ్లే ముందే విన్నర్ అవుతాడని తన ఫ్రెండ్ తో చెప్పాడట.

ఇంతకీ అభిజిత్ ఫ్రెండ్ ఎవరు అంటే ఢీ ఛాంపియన్ వన్ ఆఫ్ ది టీం లీడర్ వర్షిణి. ఇద్దరు కలిసి పెళ్లిగోల వెబ్ సీరీస్ లో నటించారు. అప్పటినుండి అభిజిత్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పింది వర్షిణి. అంతేకాదు బిగ్ బాస్ నుండి తనకు కాల్ వచిన విషయాన్ని కూడా చెప్పి వెళ్లాలా వద్దా అని తనని అడిగాడని.. అయితే తాను వెళ్లమని చెప్పానని అన్నది వర్షిణి.

ఇక ఈ సీజన్ విజేతగా అభిజిత్ గెలుస్తాడని అంటుంది వర్షిణి. హౌజ్ లోకి వెళ్లినప్పుడే అభిజిత్ విన్నర్ అవుతాడని తను ఊహించానని అంటుంది వర్షిణి. అయితే జబర్దస్త్ అవినాష్ కూడా వర్షిణికి తెలుసు కాని ఫ్రెండ్ కాబట్టి తన ఓటు అభిజిత్ కే వేసింది వర్షిణి. రెండు సినిమాల్లో హీరోగా నటించిన అభిజిత్ బిగ్ బాస్ తర్వాత కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి.                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: