తెలుగు ఇందస్త్రి లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు వుండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఆయన సినిమా మొదలైనప్పటి నుండి విడుదల అయ్యే వరకు ఎన్నో రకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. . అయితే వాటిలో చాలా వరకు నిజాలు ఉంటాయి అలాగే కొన్ని ఊహలు కూడా ఉంటాయి. 

అలా ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం “సర్కారు వారి పాట” సినిమాపై ఓ ఊహించని గాసిప్ భగ్గుమంది. అదే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం గాను స్వీటీ అనుష్కను తీసుకుంటున్నారని.

కానీ అసలు విషయంలోకి వెళ్తే అసలు ఇందులో ఎలాంటి నిజమూ లేదని అది ఫేక్ వార్త అని తేలింది. కేవలం అటెన్షన్ కోసమే కొందరు నెటిజన్స్ చేసే పిచ్చి పనులు వల్ల ఇతర ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఇదేమి కొత్త కాదు. ఇప్పటి వరకు చాలా సార్లు మన స్టార్ హీరోల సినిమాల విషయంలో సోషల్ మీడియాలో జరిగాయి..మరి దీనిపై చిత్రా యూనిట్ ప్రకటన రావలసివుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: