తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుసగా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్. సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతూన్నప్పటికి ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ చందమామ గా కాజల్ అగర్వాల్ కి చెరగని చరిష్మా  ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో.



 ఓవైపు కుర్ర హీరోలతో పర్ఫెక్ట్ జోడి గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలకు కూడా సరిగ్గా సరిపోయే జోడి గా గుర్తింపు తెచ్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుంది. కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత తన భర్త గౌతమితో కలిసి కాజల్ అగర్వాల్ మాల్దీవుల్లో హనీమూన్ కి వెళ్లి ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో తన భర్త తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంది కాజల్ అగర్వాల్.



 అయితే తాను గౌతమ్ ను  పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఇటీవలే కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. అందరి లాగానే తనకు  కూడా తన ప్రియుడు మోకాళ్లపై కూర్చుని ఎర్రని గులాబీ అందించాలని కోరుకుందట.. కాజల్ కోరుకున్నట్లుగానే గౌతమ్ కూడా కాజల్ కి ప్రపోజ్ చేయడంతో  వెంటనే కాజల్ గౌతమ్కి ఓకే చెప్పేసిందట. అలా చేయకపోతే అతడితో పెళ్లి జరిగేది కాదు అంటూ సరదాగా కామెంట్ చేసింది కాజల్ అగర్వాల్. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరి జంట కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లోకి వచ్చిందంటే చాలు అది తెగ వైరల్ అయిపోతూ అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: