ప్రస్తుతం ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు టాలీవుడ్లో కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన దర్శకుడు అనిల్ రావిపూడి. చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు అందించిన ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతకుమించి అనే రేంజ్ లో ఉంది. ప్రతి సినిమాలో సరికొత్త కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చి సినీ ప్రేక్షకులందరినీ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఏదైనా సినిమా తెరకెక్కించాడు అంటే ప్రేక్షకులందరూ కడుపుబ్బ నవ్వు కోడానికి సిద్ధంగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెరకెక్కించిన అన్ని సినిమాల్లో కూడా ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు.


 ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో సీనియర్ హీరో వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా మల్టీస్టార్ గా తెరకెక్కిన  ఎఫ్ 2 సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ వచ్చిన అసలుసిసలైన ఎంటర్టైన్మెంట్ సినిమా ఎఫ్2 అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక సాదాసీదా కథని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే ఈ సినిమా విడుదలై ఎన్నో  రోజులు అయిపోయింది ఇప్పటికీ  ఈ సినిమాకు ఇప్పటికి కూడా క్రేజ్ ఉంది.



 కాగా ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి ప్రస్తుతం అనిల్ రావిపూడి సిద్ధమయ్యాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఎఫ్2 సినిమా సీక్వెల్ కి సంబంధించి అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎఫ్ 3 సినిమాలో  మరింత పన్  ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి.. అందరూ కరోనా వ్యాక్సిన్ కనుక్కునే పనిలో ఉంటే తాము నవ్వుల వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కాబోతున్న తెలుస్తోంది. కాగా  అనిల్ రావిపూడి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: