విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దొరసాని సినిమాతో మొదటి ప్రయత్నం చేసిన విజయ్ దేవరకొండ తన సెకండ్ మూవీగా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చేశాడు. వినోద్ అనంతోజు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అమేజాన్ ప్రైం లో రిలీజైంది. ట్రైలర్ తోనే సినిమా అంచనాలు పెంచగా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది.

రాఘవ పాత్రలో ఆనంద్ దేవరకొండ అదరగొట్టాడు. సినిమాలో కొండలరావు పాత్రలో గోపరాజు రమణ కూడా చాలా బాగా చేశాడు. ఆయన పాత్ర హీరోని ఓవర్ కం చేసిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ కూడా బాగా చేసింది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా మొదటి నుండి పాజిటివ్ బజ్ ఏర్పరచింది. సినిమాలో ఆనంద్ దేవరకొండ నటన ఇంప్రెస్ చేసింది. చూస్తుంటే విజయ్ దేవరకొంద తరహాలోనే ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా నిలబడేలా ఉన్నాడు. ఇక మూడవ సినిమా విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా సినిమా ప్లాన్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సూపర్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా ఆడియెన్స్ ను అలరించడంలో సక్సెస్ అయ్యింది. మొదటి సినిమానే అయినా వినోద్ అనంతోజు తన ప్రతిభ చాటాడు. ఈమధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్ గా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా వచ్చింది.                                                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: