సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ.. తన కొత్త చిత్రం ‘క్రాక్’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమాపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమా లీగల్ కేసులో ఇరుక్కుంది. అయితే ఈ గొడవ హీరోకో, దర్శకుడికో సంబంధించింది కాదు. నిర్మాతకు సంబంధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈయన వల్లే ఇప్పుడు ఈ చిత్రంపై లీగల్ కేసు పడింది.

తెలుగులో బ్టాక్ బస్టర్‌గా నిలిచిన పూరీ జగన్నాథ్-ఎన్టీఆర్ సినిమా ‘టెంపర్‌’ను తమిళ్‌లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో పంపిణీ దారులతో ఠాగూర్ మధు 11కోట్ల మినిమం గ్యారంటీ ఒప్పందం చేసుకున్నారట. మే 10న ఈ చిత్రం విడుదల కావల్సి ఉంది. కానీ కొన్ని బకాయిలు చెల్లించడంలో ఠాగూర్ మధు ఫెయిలయ్యారు. సినిమా విడుదల చేయాలంటే తమకు 5కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలని పంపిణీ దారు డిమాండ్ చేశారు. దీంతో సినిమా డీల్ 16కోట్ల రూపాయలకు చేరింది.

అప్పుడే అడ్వాన్స్ పాత్రిపదికన పంపిణీ దారుతో నిర్మాత ఒప్పందం చేసుకున్నాడు. అంటే సినిమా వల్ల నష్టం వస్తే దాన్ని నిర్మాతే భరించి, డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చేయాలి. ఈ గొడవంతా పూర్తయిన తర్వాత ఒకరోజు ఆలస్యంగా మే 11న ‘అయోగ్య’ విడుదలయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ వాటాలో 8 కోట్ల రూపాయలను వసూలు చేసినా బంపర్ హిట్ కాలేదు. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు కోర్టుకెక్కారు. తనకు ఇవ్వాల్సిన సొమ్మును ఠాగూర్ మధు తిరిగివ్వాలని, అప్పటి వరకూ ఆయన నిర్మించిన ‘క్రాక్’ చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరీ ఈ కష్టాలన్నీ ఎదుర్కొని క్రాక్ ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: