ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా సుకుమార్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. రొటీన్ కి భిన్నంగా సినిమాలను తెరకెక్కించే సుకుమార్.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా.. చాలా రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. దానికి సంబంధించిన  బన్నీ రీసెంట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి అడవుల్లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అనూహ్యంగా.. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు సుకుమార్. ప్రేక్షకులు అసలు ఈ కాంబినేషన్ ఉంటుందా అని కల్లో కూడా ఊహించలేదు.

 ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి .అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ప్రకటించే సరికి .సాధారణ ప్రేక్షకులు సైతం ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తో  కేదార్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్నా పారితోషికాలు హాట్ టాపిక్ గా మారాయి.ఈ సినిమాకు విజయ్ దేవరకొండ 11 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అక్కడితో ఆగడం లేదు, ఈ ఎమౌంట్ కు తోడు.. దాదాపు 3 కోట్ల రూపాయల ఖరీదైన ఓ ఫారిన్ కారును కూడా అందుకోబోతున్నాడు.

ఇదంతా ప్యాకేజీలో భాగమే.ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఈ సినిమాతో కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు ఈ దర్శకుడు. దేవరకొండతో చేయబోయే సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.అంటే ప్రాజెక్టు బడ్జెట్ లో 30 కోట్లు వీళ్లిద్దరి పారితోషికాలకే సరిపోయింది. ఇక సినిమా మేకింగ్ కు ఇంకెంత ఖర్చవుతుందోనని.. ఆలోచిస్తుంటే ఈ ప్రాజెక్టుకు నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటు సుకుమార్.. పుష్ప షూటింగ్ పూర్తి అయ్యాక ..ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: