వీకెండ్ వస్తే తారలను కంట్రోల్ చేయలేం. హ్యాంగోవర్ తో ఎటు నుంచి ఎటు వెళ్తారో వారికే తెలియదు.స్ట్రెస్ రిలీఫ్ కోసమని ఒక్కోసారి గేర్ మార్చి గోవా వరకు వెళ్లిపోతుంటారు. మరీ అంతగా తిక్కరేగితే థాయ్ లాండ్ కు ప్లెయిట్ టికెట్ కొట్టేస్తారు. అయితే  కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ పిరియడ్లో ఇలాంటి  ఫన్ లన్నీ  మిస్ అయిపోయారు.సఫుల్  ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయారు.ఇప్పుడు అన్ లాక్ పిరియడ్ కావడంతో పాత స్ట్ర్రెస్ లకు చెక్ పెడుతూ లాంగ్ డ్రైవ్ లు వేస్తున్నారు. టూరిస్ట్ లను మించిన టూరిస్టులుగా చెలరేగిపోతున్నారు.

లాంగ్ ట్రిప్ వేయాలనుకుంటే ... వేసేయాలి.పబ్స్  కెళ్ళి షార్ట్ కొట్టాలంటే..  కొట్టేయాలి.అంతేగాని ఇంతకాలం ఏదో కష్టపడిపోయామనే  వంకతో... షూటింగ్ లు ఎగ్గొట్టి లాంగ్ డ్రైవ్ లకు వెళ్లకూడదు.వెళితే వెళ్లారు.. కనీసం నిర్మాతలకు ఎప్పటినుంచి అందుబాటులో ఉంటారో అదైనా చెప్పాలి.

ఫిల్మీ  స్టార్స్  కు మొన్న వచ్చిపడిన లాక్ డౌన్ పిరియడ్... ఇంట్లోనే చుక్కలు చూపించింది. బయటకు వెళ్లడానికి లేకుండా గేట్లు బంద్ చేసింది. దీంతో కొందరు తారలు ఉన్నచోటనే ఉంటూ, గార్డెనింగ్, కుకింగ్ లతో టైమ్ పాస్ చేస్తూ.. వాళ్లకు తెలిసిన ఎంటర్ టైన్మెంట్ ను పూర్తిగా మిస్ అయ్యారు.అన్ లాక్ పిరియడ్ ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూశారు.

అనుకున్న టైమ్ కు పబ్ లు ,క్లబ్ లు ఓపెన్ కాకపోవడంతో ..తారలంతా ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. దోస్త్ లతో డైరెక్ట్ బాతాకాని కొట్టలేక... జస్ట్ వీడియో కాల్ చాట్ లతో కాలక్షేపం చేసారు. వన్స్ అన్ లాక్ గైడెన్స్ జారీ చేయడంతో.... అప్పటివరకు బయటకు వెల్లలేక ఇంట్లోనే బందీలైపోయిన తారలంతా... ఎవరికి నచ్చిన హాలీడే డెస్టినేషన్ ను వారు ఎంచుకున్నారు.ఇక ఆ తర్వాత ఊరుకుంటారా చెప్పండి.రెక్కలు తొడిగిన పక్షుల్లా ఒక్కసారిగా ఎగిరిపోయారు.

హాలీడే ట్రిప్ లనగానే బాలీవుడ్ బ్యాచ్ కు ఎక్కువగా యూరప్ గుర్తుకు వస్తుంది.ఆ తర్వాత ఇప్పుడిప్పుడే హైలెట్ అవుతోన్న ఏషియన్ హాట్ స్పాట్సే... డెస్టినేషన్స్ టూరిస్ట్ స్పాట్స్ గా మారిపోతున్నాయి.కొందరు అక్కడి వాతావరణంలోని ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తే..ఇంకొందరు బీచ్ సైడ్ సరదాలతో లోకాన్ని మర్చిపోతున్నారు. ఆ మధ్య బ్యాచిలర్ పార్టీలకు కూడా ఈ స్పాట్సే మోస్ట్ వాంటెడ్ అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: